Asaduddin Owaisiఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వ, బీజేపీ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మొట్టమొదటి సారిగా ఆర్ఎస్ఎస్ కు ముస్లిం టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట ఆర్ఎస్ఎస్ పెద్దలు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలోని ముస్లింలలో కూడా ఆర్ఎస్ఎస్ ను వ్యాప్తి చేయడానికి ఆ సంస్థ ప్రయత్నాలు సాగిస్తోంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో ఇద్దరితో ఆరంభం అయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇప్పుడు మూడువేల సభ్యులకు చేరిందని చెబుతున్నారు.

ఈ సంస్థ కార్యక్రమాలలో భాగంగా ఖురాన్ లోని కొన్ని అంశాలను ఉటంకించి ఏ మతం ఉగ్రవాదాన్ని సమర్దించదని చెబుతూ ఉంటారట. దీనిద్వారా ముస్లింలలోని కొందరు అతివాదులు ఉగ్రవాదం వైపు వెళ్లకుండా ప్రయత్నం చేస్తామని వారు చెబుతున్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో ఎంఐఎం ప్రాబల్యం తగ్గించే ప్రయత్నం ఇది అని కొందరు ఆరోపిస్తున్నారు. కాగా తెలంగాణలోని జిల్లాలలో ను, తదుపరి ఎపిలోను ముస్లిం మోర్చాను అబివృద్ది చేస్తామని ఆ సంస్థ వారు అంటున్నారు.

హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంటు దాని కింద వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంఐఎంకు కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఈ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలోగానీ నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గానీ బీజేపీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే పట్టు విడవకుండా 2024 ఎన్నికలే టార్గెట్ గా పాతబస్తీలో కష్టపడుతుంది ఆర్ఎస్ఎస్.