నర్మద నదీ తీరాన చేపడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి కేంద్ర సాంస్కృతిక శాఖ కేవలం రూ.300 కోట్లే ఇవ్వగా అమరావతి నిర్మాణానికి కూడా ఇవ్వనన్ని నిధులు ఇచ్చారంటూ బాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు . తప్పుడు కూతలు కూసిన చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విగ్రహ ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదే విగ్రహం వేరే రాష్ట్రంలో వేరే ప్రభుత్వం కడితే డబ్బులు ఇవ్వరు అనేది వేరే చెప్పాల్సిన పని లేదు. గుజరాత్ ప్రభుత్వానికి ఎందుకు ఇస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.
దీనివల్లే మోడీని గుజరాత్ ప్రధానమంత్రని, ఢిల్లీలో నడుస్తుంది గుజరాత్ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు గానీ చంద్రబాబు గానీ విమర్శించేది. ఈ మాత్రం దానికి తప్పుడు కూతలని వాటికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అనడం ఏంటో? ప్రజలు మరి అంత అమాయకంగా ఏమీ లేరు నరసింహారావు గారు.