RRR Trial Shootతెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చిన తొలినాళ్ళలో సామాజిక దూర చర్యలతో ఆర్‌ఆర్‌ఆర్ ట్రయల్ షూట్‌ను ప్లాన్ చేశాడు రాజమౌళి. అయితే చివరి నిమిషంలో దాన్ని వద్దనుకున్నాడు రాజమౌళి. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున డ్యూప్‌లతో షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన ఈ స్టార్ డైరెక్టర్ దానిని విరమించుకున్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాటోగ్రాఫర్, సెంథిల్ కుమార్ తెరవెనుక ఏమి జరిగిందో వెల్లడించారు. “మేము రోజూ 400-500 మందితో షూట్ చేసేవాళ్లం. 40-50 మందితో షూటింగ్ జరపడం చాలా కష్టం, కాని మేము ప్రయత్నించాలని అనుకున్నాము. అయితే పెరుగుతున్న కేసులతో, ట్రయల్ షూట్ ను డ్రాప్ చెయ్యడం తప్ప మాకు వేరే మార్గం లేదు” అని ఆయన అన్నారు.

“ప్రతి నెలా కేసులు పెరుగుతున్నాయి. ఎప్పుడు పరిస్థితి మాములుగా అవుతుందో తెలీదు. షూట్ తిరిగి ప్రారంభించడానికి ఒకటి లేదా రెండు నెలలు పట్టవచ్చు. దేవుడు దయ దల్చితే త్వరలో షూట్ ప్రారంభించి, అభిమానుల అంచనాలకు తగినట్లుగా సినిమాను విడుదల చేస్తాము” అని ఆయన అన్నారు.

సంక్రాంతి 2021 కోసం విడుదల చేయవలసి ఉంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడు వాయిదా పడింది. ఈ బ్రేక్ కారణంగా అది వచ్చే ఏడాది జులైకి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే ఈ సినిమా కోసం నందమూరి, మెగా అభిమానులు ఏడాది కాలం వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది.