RRR Target ... Smaller compared to Bahubali 2బాలీవుడ్ కార్పొరేట్ ప్రొడక్షన్ కంపెనీ, పెన్ స్టూడియో ఆర్ఆర్ఆర్ ఉత్తర భారత థియేటర్ హక్కులు, అలాగే అన్ని భాషలకు చెందిన ఎలక్ట్రానిక్, సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. ఈ రైట్స్‌తో సహా ఈ చిత్రం వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ 750-800 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

అయితే వీటిలో చాలా వరకు డీల్స్ కరోనా కు ముందు జరిగినవే. అలా అంగీకరించిన థియేట్రికల్ ఒప్పందాలు సినిమా విడుదలయ్యే సమయానికి గౌరవించబడితే ఆ మేరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు అవుతుంది. అటువంటప్పుడు, ఈ చిత్రం 525 కోట్ల షేర్ ను రాబడితేనే హిట్ వెంచర్‌గా భావించాల్సి ఉంటుంది.

బాహుబలి 2 సుమారు 830 కోట్ల షేర్ రాబట్టింది. బాహుబలి 2 తో పోలిస్తే ఇది తక్కువ టార్గెట్ అనే అనుకోవాలి. అయితే బాహుబలి 2 రేంజ్ క్రేజ్ దక్కించుకుంటేనే అది సాధ్యపడుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పటికే అక్టోబర్ 13 విడుదలకు ప్రకటించబడింది.

అయితే, అప్పటికి ఉత్తరాన కరోనా పరిస్థితి మెరుగుపడకపోతే జనవరి 2022 కు వాయిదా వేయవచ్చు. ప్రస్తుతానికి, ఈ చిత్రం షూటింగ్ మే నాటికి పూర్తి చేసి, విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతానికి చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ గురించి ఆలోచన చెయ్యడం లేదు.