rrr-salaar-telugu-movie-digital-rights-big-offersఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్… ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలు ట్రేడ్ లో హాట్ కేకులుగా డిమాండ్ చూపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల చెయ్యనునట్టు నిర్మాతలు ప్రకటించారు. సలార్ ఇప్పటివరకు మొదటి షెడ్యూల్ షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్ కు భారీ ఆఫర్లు వచ్చినట్టు సమాచారం.

అమెజాన్ ప్రైమ్ వీడియో సలార్ కు ఒక భారీ ఆఫర్ ఇచ్చిందట. భారతీయ సినిమాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సినిమాకు అమెజాన్ ఇచ్చిన ఆఫర్లలో ఒకానొక అతి పెద్ద ఆఫర్ అని మనకున్న సమాచారం. అయితే కేజీఎఫ్ 2 విడుదల తరువాత మరింత మంచి రేటు వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట.

మరోవైపు.. డిస్నీ + హాట్ స్టార్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మీద కన్నేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ కు గానూ 200 కోట్లు ఇవ్వజూపిందట. హాట్ స్టార్ భారతీయ సినిమాలకు ఇచ్చిన అత్యధిక రేట్లలో ఇదే హైయెస్ట్ అని సమాచారం. అయితే ఇంకా దీనిపై తుదినిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.

ఈ రెండు సినిమాలకు థియేటర్ రన్లకు ఉన్న సత్తా కారణంగా త్వరగా కూడా ఆన్ లైన్ లో విడుదల అయ్యే అవకాశం లేదు. అయినా భారీ మొత్తలు చెల్లించి రైట్స్ దక్కించుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్లు ఆరాటపడటం గమనార్హం. సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న వేసవి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.