RRR -Ram-Charan - Jr NTR Happy Birthdayయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రోజు తన 37వ పడిలోకి అడుగుపెట్టాడు. దీనితో అభిమానులు పండుగ మూడ్‌లో ఉన్నారు. పుట్టినరోజు ట్వీట్‌లతో ట్విట్టర్‌ను నింపుతున్నారు. #HappyBirthdayNTR అనే హ్యాష్‌ట్యాగ్ నిన్నటి నుండి జాతీయంగా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ లో ఒక విషయంపై ఎక్కువ ట్వీట్లు వేసిన రికార్డు కూడా నెలకొల్పారు.

అయితే, ఆర్ఆర్ఆర్ బృందం వారి చిత్రం నుండి ఎన్టీఆర్ క్యారెక్టర్ వీడియోను విడుదల చేయలేదని వారు నిరాశ చెందుతున్నారు. కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లేదు. కానీ రెండు చిత్రాలు రోజును స్పెషల్ గా చేశాయి. మొదటిది ఎన్టీఆర్ జిమ్ బాడీని చూపించే ఫోటో ఆయన పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ నిన్న విడుదల చేశాడు.

రెండవది ఈ ఉదయం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సహా నటుడు రామ్ చరణ్ చేత పోస్ట్ చేయబడింది. చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి ఒక చిత్రాన్ని పోస్ట్ చేసాడు మరియు ఇద్దరు తారలు అద్భుతంగా బాండ్ అయినట్టుగా కనిపిస్తోంది. వారి కుటుంబాలు చాలా సంవత్సరాలు వృత్తిపరమైన పోటీని పంచుకున్నాయి, ఇక అభిమానులైతే ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునేవారు.

ఇక ఆర్ఆర్ఆర్ బృందం ఒక లొకేషన్ స్టిల్ ని పోస్టర్ గా చేసి విషెస్ పోస్టర్ గా విడుదల చేసింది. అందులో కూడా ఎన్టీఆర్ అదిరిపోయాడు. అయితే సినిమా గెట్ అప్ లోని ఫోటో కాదు. ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ మెటీరియల్ స్థాయిలో కాకపోయినా ఈ మూడు చిత్రాలు వారిని అలరించాయి అని చెప్పుకోవచ్చు.