RRR Movieఈరోజు జనవరి 8, 2021… ప్రపంచం మీద కరోనా ప్రభావం అంటూ లేకపోయి ఉంటే ఈరోజు ఎస్ఎస్ రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా… ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఆ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. అంటే అనుకున్న సమయానికంటే ఏడాది ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దానితో జనవరి 8, 2021 విడుదలకు సంబంధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్లను ఫ్యాన్స్ కోట్ చేసి బాధపడుతున్నారు. వారి బాధ చూడలేకపోయిన రాజమౌళి కుమారుడు ఒక ఫ్యాన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సదరు హేమంత్ అనే ఫ్యాన్ మరి కొందరు ఫ్యాన్స్ ని సెలెక్ట్ చేసి వారికి ఆర్ఆర్ఆర్ సెట్లను చూపిస్తాడట.

దానితో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రామ్ చరణ్ కరోనా బారిన పడిన కారణంగా షూటింగ్ మందగించింది. మరోవైపు… అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి పోరాటాలకు ముందు ఢీల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో అనేది ఈ చిత్రం.

ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ హీరోయిన్ నటిస్తుంది. ఈ మల్టీస్టారర్ చిత్రంతో అలియా భట్ తన తెలుగు అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో సరసన ఆమె కనిపించనుంది. చిత్రంలోని ఒక కీలక పాత్రలో మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కనిపించనున్నారు.