RRR movie producer - DVV Dhanayyaప్రాంతీయ భాషలో సినిమాను తెరకెక్కించి దానిని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. అంతటి మహత్తరమైన కార్యాన్ని ‘బాహుబలి’ ప్రొడ్యూసర్స్ టీమ్ ‘శోభు యార్లగడ్డ అండ్ కో’ విజయవంతంగా నిర్వహించింది.

హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళిలతో పాటు నిర్మాతలు ‘శోభు అండ్ టీమ్’ కూడా ‘బాహుబలి’ సినిమా పబ్లిసిటీని తమ భుజస్కంధాల పైన వేసుకుని ఓ వైపు సోషల్ మీడియాలోనూ, మరో వైపు సినీ వేడుకలలోనూ ప్రమోషన్స్ చేసారు. కేవలం డబ్బులు పెట్టడమే కాదు, ప్రమోషన్స్ లో కూడా నిర్మాతల రోల్ కీలకమని చాటిచెప్పారు.

నాటి ‘బాహుబలి’ నిర్మాతల తీరు ఇలా అయితే, నేటి పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య ఎలా ప్రమోట్ చేస్తున్నారు? అంటే… ఈవెంట్ ఎక్కడ జరిగినా, ‘ఆల్ ది బెస్ట్’ అన్న ఒక్క డైలాగ్ మాత్రమే దానయ్య నోటి వెంట వస్తోంది.

ఒకానొక ఈవెంట్ లో ఆ ఒక్క డైలాగ్ కూడా లేకపోవడంతో, ‘ఆల్ ది బెస్ట్ కూడా లేదా సార్’ అంటూ ట్రోల్ చేయడం నెటిజన్ల వంతవుతోంది. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన దానయ్య గారికి స్టేజి పైన బొకేలు కూడా ఇవ్వకపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కేవలం ఓ ఉత్సవ విగ్రహంలా దానయ్య మిగిలిపోతున్నారని, ప్రతి ఈవెంట్ కు హాజరవుతున్నారు గానీ, ఈవెంట్ లో ఉన్నా లేనట్లే వ్యవహరిస్తున్నారని, కనీసం టైం పాస్ కు మా నిర్మాతకు స్నాక్స్ అయినా ఇవ్వండి… అంటూ రకరకాలుగా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఒకప్పుడు ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టడం వరకే! కానీ నేడు మారిన పరిస్థితుల రీత్యా ప్రొడ్యూసర్ రోల్ చాలా కీలకమైంది. ఏదో డమ్మీ ప్రొడ్యూసర్ మాదిరి వ్యవహరిస్తామంటే కుదరదని దానయ్యను నెటిజన్లు అలెర్ట్ చేస్తున్నారు. బహుశా ఈ ట్రోల్స్ తర్వాత అయినా దానయ్య పెదవి విప్పుతారేమో చూడాలి.