క్షణాలు గడిచే కొద్దీ సినీ ప్రేక్షకుడికి “ఆర్ఆర్ఆర్” మీద ఆత్రుత పెరిగిపోతుంది. ఇద్దరి హీరోల అభిమానులు ఆన్ & ఆఫ్ లైన్స్ రెండింటిలోను టికెట్ల కొరతతో అల్లాడుతున్నారు. ప్రీమియం షోకు సమయం దగ్గర పడడంతో ‘సమయం లేదు మిత్రమా’ అంటూ టిక్కెట్ల వేటలో మునిగిపోయారు యావత్ సినీ ప్రపంచం.
“ఎంత సేపు ఈ నక్కల వేట… కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా” అంటూ అటు మెగా, ఇటు నందమూరి అభిమానులు ఆర్ఆర్ఆర్ టిక్కెట్ల వేటకు సిద్ధమయ్యారు. సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి., అలాగే టికెట్స్ ధరలు నింగికెగిశాయి. అయినా తగ్గేదేలే అన్నట్లు ఉంది ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి.
ఓవర్సీస్ లో అట ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. సినిమా టాక్ కోసం యావత్ సినీ ప్రపంచంతో పాటు జక్కన్న & టీం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తెలంగాణ రాష్ట్రమంత అదనపు షోలకు అనుమతినిచ్చింది. అయితే ఏపీలో కూడా సినిమా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలో అదనపు షోలకు అవకాశమిచ్చింది.
సినిమా ట్రైలర్ తోనే పాజిటివ్ బజ్ ను సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్., అదే దూకుడుతో ముందుకెళితే బాహుబలి రికార్డ్స్ కనుమరుగయ్యే అవకాశం లేక పోలేదంటున్నారు ట్రేడ్ పండితులు. దర్శక దిగ్గజం రాజమౌళి, ఊహా పరిజ్ఞానానికి…, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా ప్రావీణ్యతకు., రామ్ చరణ్ నట విశ్వరూపానికి ఈ సినిమా తార్కాణం కాబోతుందనేది సినీ ప్రేమికుల ఆలోచన. టాలీవుడ్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన ఘనత మాత్రం జక్కన్నకే దక్కుతుందని తెలుగు సినీ ప్రపంచం ఏకఖంఠంగా గొంతెత్తి చాటుతుంది.
ఈ సినిమా ఫస్ట్ రివ్యూ కోసం అందరూ ఫాలో అవుతూ ఉండండి మీ అభిమాన మిర్చి9.కాం.