RRR only three songsరాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవలే బల్గేరియాలో ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తొందరలో ఇంకో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు అవుతుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా తెలిసిన ఒక విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కేవలం మూడే పాటలు ఉంటాయంట. ఇంకో పాట మాంటేజ్ పాట కింద బ్యాక్ గ్రౌండ్ లో వస్తుందట.

జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మన రెండు తెలుగు రాష్ట్రాలకు తప్ప పెద్దగా తెలియని ఇద్దరి యోధుల కథను దేశం మొత్తం పరిచయం చెయ్యాలని రాజమౌళి పరితపిస్తున్నాడు.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి డీవీవీ దాన‌య్య నిర్మాత. మరోవైపు ఎన్టీఆర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పబోతున్నారని వినికిడి.