ఆర్ఆర్ఆర్ గురించి లీకైన చిత్రాలు చెబుతున్న విశేషాలు

RRR movie Leaked photo reveals it as periodic movieయంగ్ టైగ‌ర్ ఎన్టీయార్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాని ఆర్ఆర్ఆర్ – రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అంటున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి డీవీవీ దాన‌య్య నిర్మాత. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించిన ఒక ఫైట్ ను రామ్ చరణ్ మీద హైదరాబాద్ లో తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోని కొన్ని చిత్రం లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఒక చిత్రంలో అంగాపూర్ పోలీసు అవుట్ పోస్టు సెట్ కనిపిస్తుంది. దాని ముందు బ్రిటిష్ జెండా ఎగురుతుంది. దీని బట్టి సినిమా కథ స్వరాజ్యం రాకముందు జరుగుతుంది అని అర్ధం అవుతుంది. అంగాపూర్ అనేది హర్యానాలో ఉంది కాబట్టి ఈ కథ అక్కడ జరిగి ఉండవచ్చు. గతంలో రామ్ చరణ్ ఈ సినిమాలో పోలీసు అని ఎన్టీఆర్ దొంగగా కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపించాయి. పోలీసు అవుట్ పోస్టును బట్టి అది నిజం అయ్యి ఉండవచ్చు. దీనితో ఒక్కసారిగా ఈ సినిమాపై అభిమానుల అంచనాలు రేటింపు అయిపోయాయి.

అయితే ఈ చిత్రాల లీక్ పై రాజమౌళి సినిమా యూనిట్ పై ఫైర్ అవుతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రంపై ఇంకో పుకారు బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గెస్ట్ క్యారెక్టర్ చేసే హీరో ఎవరో కాదు ప్రభాస్ అని చెప్తున్నారు. ప్రభాస్ ఆర్ఆర్ఆర్ లో గెస్ట్ క్యారెక్టర్ చేస్తే.. ఆ సినిమాకు మరింత మైలేజ్ వస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాలి. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప మిగతా నటులు ఎవరి గురించీ టీమ్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

Follow @mirchi9 for more User Comments
Kanchana 3 Telugu Movie ReviewDon't MissKanchana 3 Review - Triple Dose Of BoredomBOTTOM LINE Triple Dose Of Boredom OUR RATING 2/5 CENSOR 'UA' Certified What Is the...Jersey Movie ReviewDon't MissJersey Review - Nani Powered Emotional RideBOTTOM LINE Nani Powered Emotional Ride OUR RATING 3/5 CENSOR 'U' Certified, 2 hrs 40...Lakshmis NTR Orphaned after elections 2019Don't MissNTR Becomes OrphanThe world has turned topsy-turvy in March and Early April. People who have hated or...Allu Arjun - Trivikram - Srinivas-Don't MissTrivikram Taking Rajamouli's Route for Allu ArjunRajamouli's 'Baahubali has definitely changed the perspective of the filmmakers down South in India, and...Ajay Bhupathi - Samantha Akkineni - Naga ChaitanyaDon't MissRX 100 Director Wooed in Samantha!It's a known thing but let us tell that we were pretty much intrigued when...
Mirchi9