RRR - Jr NTR - Charanఎన్టీఆర్, రామ్ చరణ్ దాదాపుగా మూడేళ్ళగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో చిక్కుబడిపోయారు. సహజంగా రాజమౌళి తో సినిమా అంటే అది అంతత్వరగా తేలే అవకాశం లేదు పైగా దానికి ఈ సారి కరోనా కూడా జాతయ్యింది. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ చెబుతున్నా అది వచ్చేవరకు అభిమానులకు అనుమానమే.

మరోవైపు… తాజాగా ఆర్ఆర్ఆర్ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. సినిమా కోసం రెండు పాటలు షూట్ చెయ్యాల్సిఉందని… అందులో ఒక పాటకే ఏకంగా నెల రోజుల సమయం పడుతుందని సారాంశం. ఒకపాటకే నెల రోజులు అంటే ఇక మిగతా షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులలో టెన్షన్ మొదలయ్యింది.

ఈ విషయంలో రామ్ చరణ్ కు రిస్క్ తక్కువే అని చెప్పుకోవాలి. రామ్ చరణ్ శంకర్ తో తన తదుపరి సినిమా చెయ్యబోతున్నాడు. శంకర్ ఇండియన్ 2 కాంట్రవర్సీలో ఉన్నాడు గనుక ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియదు. కాబట్టి ఆర్ఆర్ఆర్ లేట్ అయినా కూడానా రామ్ చరణ్ కు పెద్ద ఇబ్బంది లేదు. పైగా ఆచార్య రూపంలో ఇంకో రిలీజ్ ఎలాగూ ఉంది.

అయితే ఎన్టీఆర్ పరిస్థితి అలా కాదు… ఆర్ఆర్ఆర్ పూర్తి చేసి ఒక టీవీ షో, కొరటాల సినిమా మొదలుపెట్టాలి. ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేసేలోపు ఈ రెండు పూర్తి చెయ్యాలి. ఆర్ఆర్ఆర్ ఆలస్యమైతే అంతా ఆలస్యం అవుతుంది. కాబట్టి రామ్ చరణ్ బిందాస్ గా ఉన్నా ఎన్టీఆర్ వర్రీ అవ్వకతప్పడం లేదు.