Ram Charan - Jr NTR - RRR Movieరాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫైట్ మాత్రమే చిత్రీకరించారు. మరో ఫైట్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అంటే ఇప్పటిదాకా సినిమా షూటింగు 10% కూడా అవ్వలేదు. ఇప్పుడు ఉన్నఫళంగా చిత్రంలోని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను వచ్చే నెల 29న హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయ్యబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఇంకా కంఫర్మ్ కాలేదు.

బాహుబలి సినిమా సందర్భంగా కూడా రాజమౌళి చిత్రంలోని నటీనటుల పుట్టిన రోజులకు చిత్రంలోని వారి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు కూడా అదే చేయ్యవచ్చని అంతా అనుకుంటున్నారు. అయితే 10% షూటింగు కూడా అవ్వకుండా చేస్తారా అనేది అనుమానమే. ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి దశాబ్దాలుగా ఉప్పూ నిప్పూ గా ఉన్న నందమూరి, మెగా కుటుంబాలను ఒక దగ్గరకి తెస్తున్నారు రాజమౌళి. దీనితో ఈ చిత్రం మీద భారీగా హైప్ ఉంది. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది చివరిలో విడుదల కావొచ్చు.

దాదాపు 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి డీవీవీ దాన‌య్య నిర్మాత. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించిన ఒక ఫైట్ ను రామ్ చరణ్ మీద హైదరాబాద్ లో తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోని కొన్ని చిత్రం లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక చిత్రంలో అంగాపూర్ పోలీసు అవుట్ పోస్టు సెట్ కనిపిస్తుంది. దాని ముందు బ్రిటిష్ జెండా ఎగురుతుంది. దీని బట్టి సినిమా కథ స్వరాజ్యం రాకముందు జరుగుతుంది అని అర్ధం అవుతుంది. అంగాపూర్ అనేది హర్యానాలో ఉంది కాబట్టి ఈ కథ అక్కడ జరిగి ఉండవచ్చు.