rrr jr ntr memes“ఆర్ఆర్ఆర్” సినిమా ధియేటర్లలో చేస్తోన్న సందడికి ‘రీ సౌండ్’ ఎలా ఉందో అందరికి తెలిసిందే. వీక్ డేస్ లో కూడా సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేస్తోన్న ఈ సినిమాలోని పలు సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ‘మేమ్స్’ హిలేరియస్ గా మారుతున్నాయి.

ఇప్పటికే కొన్ని వందల మేమ్స్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ముంచేయగా, నెటిజన్లు ఇంకా తమ సృజనాత్మకతను జోడించి మరిన్ని మేమ్స్ సృష్టిస్తున్నారు. ఈ మేమ్స్ లో ఎక్కువ శాతం జూనియర్ ఎన్టీఆర్ – పులి నడుమ వచ్చేవి ఎక్కువగా ఉండడం విశేషం.

అలాంటి మేమ్స్ లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఉన్న ‘కొమురం భీమ్’ తమకు అన్యాయం చేసేశాడని పులి ఆక్రోశించే మేమ్ నవ్వులు పూయిస్తోంది. ‘మన్మధుడు’ సినిమాలో బ్రహ్మానందం కాఫీ ఆర్డర్ చేసిన సమయంలో సీన్ ను లింక్ పెడుతూ రూపొందించిన ‘మేమ్’ అద్భుతంగా పండింది.

ఇంటర్వెల్ సీన్ లో పులులను తీసుకొచ్చి బ్రిటిష్ వారిపై దండయాత్ర చేసిన కొమురం భీమ్, ఆ తర్వాత పులులను అక్కడే వదిలేసి మల్లిని తీసుకువెళ్లిపోయారని, ఆ పులులు బ్రిటిష్ ప్యాలస్ లో నివాసం ఉన్నందుకు గానీ పులిని రెంట్ అడుగుతూ రూపొందించిన ‘మేమ్’ నెట్టింట హల్చల్ చేస్తోంది.