RRR has denied from India's official entry to Oscarsసినిమాల‌కు సంబంధించిన అతి పెద్ద అవార్డ్ ఆస్కార్‌. ఈ అవార్డును ద‌క్కించుకోవాల‌ని ప్ర‌తీ భార‌తీయుడు కోరుకుంటాడు. ఒక‌ప్పుడు ఈ అవార్డ్స్ లిస్టులో మ‌న సినిమాలే ఉండేవి కావు. ఒక వేళ మ‌న దేశానికి చెందిన సినిమాలున్నా.. అవి మ‌న తెలుగు సినిమాలు మాత్రం అయ్యేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. టాలీవుడ్ త‌న పంథాను మార్చుకుంది. హాలీవుడ్ రేంజ్‌కు టెక్నిక‌ల్‌గా పోటీ ప‌డ‌క‌పోయినా.. హాలీవుడ్ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా సినిమాల‌ను చేస్తున్నారు. రీసెంట్‌గా అలా హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న చిత్రం RRR. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మ‌ల్టీస్టార‌ర్ రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్‌కు వెళ్లే ఇండియ‌న్ సినిమాల లిస్టులో ఉంద‌ని వార్త‌లు బ‌లంగా వినిపించాయి.

మ‌రో వైపు RRRకు పోటీగా మ‌రో సినిమా కాశ్మీరీ ఫైల్స్ నుంచి ప్ర‌ధాన పోటీ వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. నిజానికి కాశ్మీర్ ఫైల్స్ ఎలాంటి బ‌జ్ లేకుండా విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. కశ్మీరీ పండిట్స్‌పై జ‌రిగిన దురాగ‌తాల‌పై తెర‌కెక్కిన ఈ సినిమా .. ఇది హిందు స‌మాజానికి, ఓ రాజ‌కీయ పార్టీకి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో ఈ సినిమాకు కూడా ఎక్కువ అవ‌కాశాలుంటాయ‌నే వాద‌న వ‌చ్చింది.

ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా RRR, కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల‌తో పాటు మ‌రి కొన్ని సినిమాల‌ను చూసి ఆస్కార్ అవార్డుల‌కు ఏ సినిమాను పంపాల‌నేది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని దానిపై ఎగ్జ‌యిట్‌మెంట్ నెల‌కొంది. RRR అనేది పీరియాడిక్ మూవీ, పేట్రియాటిజం బేస్‌తో భారీ బ‌డ్జెట్ మూవీగా చేసింది. టాలీవుడ్‌కి చెందిన ఇద్ద‌రు అగ్ర హీరోలు న‌టించారు. ఈ సినిమాను క‌మిటీ ఆస్కార్‌కి ఎంపిక చేస్తే తెలుగువాళ్లుగా మ‌నకెంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌వుతుంది. తెలుగువారు భావించారు. కానీ సినిమాల‌పై పొలిటిక‌ల్ ఎఫెక్ట్ ఉంటుంద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ల్ ఫిల్మ్ కేట‌గిరిలో ఇటు RRR.. అటు కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఆస్కార్ బ‌రిలోకి మ‌న త‌ర‌పున వెళ్ల‌టం లేదు. గుజరాతీ సినిమా ఛేల్లో షో నామినేట్ అయ్యింది. అస‌లు చాలా మందికి ఈ సినిమా పేరే తెలియ‌ద‌ని, అది కూడా ఒక ఇటాలియన్ మూవీ ఫ్రీమేక్ ( ఇన్స్పిరేషన్ )అలాంటి సినిమాను ఎంపిక చేయ‌టంపై ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్ పెద‌వి విరుస్తున్నారు.

Exclusive Video Interviews: Watch & Subscribe