RRR case Bad sign for Jagan governmentసుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి ఏపీ సీఐడీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుని సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి చేర్చింది. జ్యుడీషియల్ అధికారి నేతృత్వంలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సేకరించిన రక్త నమూనాలను వైద్య బృందం ల్యాబ్‌కు పంపింది. వైద్య పరీక్షలు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు… ఈ నెల 21 వరకు ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు చికిత్స అందిస్తారని… దానితో ఆ రోజు వరకు ఆయన ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండబోతున్నట్టు సమాచారం. అదే రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి, వీడియోగ్రఫి, స్టేట్‌మెంట్‌ను సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు జ్యుడిషియల్ అధికారి అందజేస్తారు. అయితే ఇది ఒకరకంగా జగన్ సర్కారుకు బ్యాడ్ సైన్ అనే అంటున్నారు న్యాయ నిపుణులు.

రఘురామ కృష్ణంరాజుకు అంతా బావుంటే వైద్య పరీక్షలు జరిపి వెంటనే గుంటూరు జైలుకు తరలించాల్సి ఉంది. ఇంకా మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంచబోతున్నారు అంటే ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం విషయంలో ఏదో జరుగుతునట్టే. ఒకవేళ ఆయనను కస్టడీలో కొట్టినట్టు తేలితే అటు సీఐడీ అధికారులకు ఇటు ప్రభుత్వానికీ ఇబ్బంది.

పైగా అవి కొట్టిన దెబ్బలు కావు అని రిపోర్టు ఇచ్చిన గుంటూరు మెడికల్ బోర్డు వైద్యులకు కూడా ఇబ్బందే. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ ఈ నెల 21 వరకు ఉండేలా ఉంది. మరోవైపు…. అదే రోజున సుప్రీం కోర్టులో ఆర్ఆర్ఆర్ బెయిల్ పిటిషన్ హియరింగ్ కు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఎవరికీ మోదం ఎవరికీ ఖేదం అనేది చూడాలి.