RRR Movie - Press Meet highlightsఆర్‌ ఆర్‌ ఆర్‌ కు సంబంధించిన వివరాలను ఎట్టకేలకు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ల, నిర్మాత దానయ్య కూడా హాజరయ్యారు. ఇప్పటిదాకా వర్కింగ్ టిక్కెట్ గా ఉన్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ నే ఇప్పుడు సినిమా టైటిల్ గా కంఫర్మ్ చేశారు. ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు అటు తెలంగాణాలోని కొమరం భీమ్ బ్రిటిష్, నిజాం మీద పోరాటం చెయ్యడానికి కొంచెం ముందు కొంత కాలం ఎవరికీ తెలియకుండా మాయం అయిపోయారు.

ఆ కాలంలో వారు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు అనే ఒక కల్పిత కథ ఆర్‌ ఆర్‌ ఆర్‌. వారిద్దరూ ఒకరినొకరు ఎలా ప్రభావితం చేసుకున్నారు అనేది రాజమౌళి సినిమా. ఆలియా భట్‌ చరణ్‌కు జోడీగా నటిస్తారు. తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్‌ చేస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ ఫ్లాష్ బ్యాక్ లో ఒక కీలకమైన రోల్ చేస్తున్నారు. సముద్రఖని కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన సినిమా మొదటి షెడ్యూల్ లో పాల్గొన్నారు. సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రను తారక్‌ చేస్తారు.

“సినిమాను 2020 జులై 30 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి కూడా రిక్వెస్ట్స్‌ వస్తున్నాయి. అన్ని భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌చేస్తున్నాం” అని చిత్ర నిర్మాతలు దానయ్య చెప్పుకొచ్చారు. చిత్ర విడుదల సంవత్సరం పైగా ఉండడం విశేషం. సినిమా విడుదలకు చాలా టైమ్ ఉండడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్స్ ఈ సంవత్సరం అయితే ఉండదని రాజమౌళి కంఫర్మ్ చేసారు.