Pelli SandaD Songs release in youtubeస్టార్ డంతో నిమిత్తం లేకుండా ఒక పాట ప్రేక్షకులను మెప్పించగలిగితే అది ఎంతవరకు చేరువ అవుతుందనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది ”మధురానగరిలో…” అన్న పాట. దర్శక దిగ్గజం కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన “పెళ్ళిసందడి” సినిమాలోని ఈ పాట వీడియో సాంగ్ ను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్.

విడుదల చేసిన 9 రోజుల్లోనే ఒక కోటికి పైగా (12 మిలియన్ల) క్లిక్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ‘స్టార్’ హీరో ట్యాగ్ లేకుండా ఇన్ని క్లిక్స్ ను సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతంగా తెరకెక్కించిన ఘనత కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు దక్కుతుంది. ముఖ్యంగా ‘దొరక్క దొరక్క దొరికింది…’ అన్న లిరిక్స్ సమయంలో వేసిన స్టెప్స్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

నిజానికి ఈ పాట యూట్యూబ్ లో రిలీజ్ కాక ముందే, థియేటర్ లో రికార్డు చేసిన ఈ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అధికారికంగా విడుదలైన తర్వాత అంతకుమించిన స్థాయిలో ఇంస్టాగ్రామ్ లో ఈ పాటకు సంబంధించిన వీడియో క్లిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిపోయింది.