roshagadu-movie--teaserroshagadu-movie--teaser‘బిచ్చగాడు’ సినిమాతో వచ్చిన అనూహ్యమైన క్రేజ్ తో, తన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయ్ అంటోనీ, తాజాగా “రోషగాడు” రూపంలో ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘స్నీక్ పీక్’ అంటూ నాలుగు నిముషాల నిడివి గల సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేసాడు విజయ్.

తన ప్రతి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇలాగే చేస్తూ…. విడుదలకు ఒకటి, రెండు రోజుల ముందు ఇలా స్నీక్ పీక్ లను విడుదల చేయడంలో విజయ్ దిట్ట. అలాగే సినిమాలో ఉన్న మంచి సీన్స్ లో ఈ స్నీక్ పీక్ రూపంలో అందించి, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ సారి కూడా తనదైన మార్క్ సీన్ ను విడుదల చేసాడు. విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా అయినా సక్సెస్ ను సొంతం చేస్తుందేమో చూడాలి.