roshagadu-movie--teaserroshagadu-movie--teaser‘బిచ్చగాడు’ సినిమాతో వచ్చిన అనూహ్యమైన సక్సెస్ ను కొనసాగించడంలో తమిళ హీరో విజయ్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఆ సినిమా తర్వాత ప్రతి సినిమా తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కటి కూడా సక్సెస్ సాధించలేదు. తాజాగా “రోషగాడు”తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను విడుదల చేయగా, పోలీస్ డ్రెస్ వేసుకుని ‘తాము పెద్ద పుడింగిలమేనని’ సామాన్య జనాలకు క్లాస్ పీకుతూ దర్శనమిచ్చారు విజయ్. ఇక మిగిలినదంతా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ తో తమిళ మాస్ కొట్టుడు కామన్. విజయ్ సరసన నివేదా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అయినా విజయ్ కు సక్సెస్ ను దరిచేరుస్తుందేమో చూడాలి.