YSRCP-MLA-Roja-Goes-Viral-Again-for-Her-Foul-Mouth-1వైసీపీ నుండి రోజా వీడిపోతుందన్న ప్రతిసారి వార్తలు వచ్చిన సమయంలో… తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికేత్తేస్తూ, సదరు వార్తలను ఖండించడం నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల కాలంలో చేస్తోన్న విషయం. అయితే ఈ సారి అలాంటి వార్తలేవీ రాక మునుపే రోజా ఫేస్ బుక్ వేదికగా తన అభిమానాన్ని కురిపించడం విశేషం. మరి దీని వెనుక ఆంతర్యం ఏమిటో గానీ… నా ధైర్యం, నా నమ్మకం, నా నాయకుడు జగనన్న… కట్టే కాలే వరకూ జై జగన్ అనే నినదిస్తుంటా… అంటూ ఓ పోస్టర్ ను పోస్ట్ చేయడంతో పాటు, ఓ సుదీర్ఘ అభిమాన లేఖను కూడా పోస్ట్ చేసారు.

ఆ అభిమానం ఎంతవరకు చేరుకుందంటే… శాంపిల్ గా అందులో ఒకటి తీసుకుందాం. “మనకు లభించిన మత గ్రంధాల రచయితలు రాముడు, కృష్ణుడు, క్రీస్తు, అల్లాల గురించి పాజిటివ్ గా రాసారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, అదే వ్యతిరేకంగా రాస్తే ఆ దేవుళ్ళే దెయ్యాలయ్యేవారు.” చదివారు కదా… ఇక రోజా ఆంతర్యం ఏమిటో అవగతం చేసుకోవచ్చు. వీటికి కొనసాగింపుగా… ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రాణం పోతున్నా మడమ తిప్పడు… నిజాయితీపరుడు… నీతిమంతుడు… ప్రజా నాయకుడు… మేధావి… చివరాఖర్లో పుచ్చలపల్లి సుందరయ్య మాదిరి సబ్జెక్ట్ మాట్లాడతారట జగన్.

ఇందులో జగన్ పై రోజా ప్రదర్శిస్తున్న ప్రేమాభిమానాలే కనపడుతున్నాయి తప్ప, ఇసుమంత వాస్తవం కూడా లేదని నెటిజన్లు తిప్పికొడుతున్నారు. రోజా విశ్లేషించిన అన్ని పాయింట్లలో జగన్ వ్యవహారశైలి తప్పని ఇప్పటికే నిరూపణ అయ్యింది. ‘మడమ తిప్పడు’ అన్నది ఒకప్పటి జగన్ నినాదం అయితే… ప్రస్తుతం బిజెపి వ్యవహారంలో జగన్ తిప్పిన మడమ బహుశా రోజా గారికి కనపడలేదేమో అన్న కౌంటర్లు పడుతున్నాయి. ఇక నిజాయితీపరుడు… నీతిమంతుడు…అని చెప్పిన రోజాకు ఇప్పటివరకు జగన్ నుండి కొన్ని వందల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలియదా? మరి అవన్నీ ఏ నీతి, నిజాయితీ బుట్టలో నుండి దాగి వచ్చాయో..?!

ప్రజా నాయకుడు… మేధావి… అవును… జగన్ నిజంగా ప్రజా నాయకుడే. రాష్ట్రంలో ఏ సెంటర్ కు వెళ్ళినా మాట మార్చకుండా ఒకే ఒక్క మాట చెప్పే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమే. అదే… తాను ముఖ్యమంత్రి కాబోతున్నాను, త్వరలోనే మన కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి..! ఇంత గొప్పగా చెప్పే రాజకీయ మేధావి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చవిచూడలేదని చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా… దేవుళ్ళు… మనకు కనిపించని శక్తులతో జగన్ ను పోల్చినపుడే రోజాలోని ఆంతర్యం అర్ధమైంది గనుక, దేవుళ్ళ జోలికి పోనవసరం లేదు. అయితే ఉన్నట్లుండి రోజా ఇంత హంగామా ఎందుకు చేస్తోంది? అన్న ప్రశ్న మాత్రం పొలిటికల్ వర్గాలకు అర్ధం కాని పరిస్థితి.