roja lakshmi parvathi fires on chandrababu naiduఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న చంద్రబాబును దేశవిదేశాల ప్రముఖులు ప్రశంసించిన విధానం ఇటీవల జరిగిన విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సదస్సులో చూసినదే. అంతటి మెప్పులు పొందిన చంద్రబాబును రాష్ట్రంలో ఇద్దరు మహిళలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఆ జాబితాలో ప్రధమురాలు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ స్వర్గస్తులైన తర్వాత స్థాపించిన పార్టీ అడ్రస్ లేకుండా పోగా, అప్పటినుండి ప్రారంభమైన ఆరోపణల వెల్లువ తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యకలాపాలను సైతం విమర్శించే స్థాయికి చేరుకున్నాయి. ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి పదవి పోవడానికి కారణమైన చంద్రబాబు వలనే, తీవ్ర మనోవేదనతో ఎన్టీఆర్ కన్నుముసారని లక్ష్మీపార్వతి చేసిన విమర్శలు అందరికీ తెలిసిందే.

పార్టీ బాధ్యతలను సైతం నందమూరి వంశీయులకు అప్పగించి, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు విడిచిపెట్టాలని… ఇలా అనేకానేక ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టిన లక్ష్మీపార్వతి తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సేకరిస్తున్న విరాళాలపై విమర్శలు చేసారు. ఈ ట్రస్ట్ చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తుండడంతో మరోసారి ట్రస్ట్ పేరుతో బాబును టార్గెట్ చేసారు. అయితే రాజకీయాల్లో ఆమెకున్న ప్రాధాన్యత రీత్యా లక్ష్మీపార్వతి చేసే విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత లభించదు.

ఇక, చంద్రబాబును టార్గెట్ చేసే మరో మహిళ నగరి ఎమ్మెల్యే రోజా. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ తెరంగ్రేటం చేసి అంచెలంచెలుగా ఎదిగిన రోజాకు ప్రస్తుతం చంద్రబాబే బద్ధశత్రువు. రాజకీయ పరమైన విమర్శలే కాదు, వ్యక్తిగత
విమర్శలను కూడా గుప్పించడంలో రోజా ముందున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ వేదికగా రోజా సృష్టించిన రచ్చ బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే చిత్తూరు జిల్లావాసి అని చంద్రబాబు పేరు తలచుకోవడం సిగ్గు చేటుగా ఉందని తిరుమల వేదికగా రోజా చేసిన వాడివేడి ప్రసంగం తెలిసిందే. లొకేషన్ ఏదైనా, సందర్భం ఏమైనా రోజా టార్గెట్ మాత్రం వన్ అండ్ ఓన్లీ చంద్రబాబే. అసలు విశేషం ఏమిటంటే… ఒకప్పుడు వేర్వేరుగా వున్న ఈ ఇద్దరు మహిళా నేతలు ప్రస్తుతం వైసీపీ నీడన జగన్ పక్షాన చేరారు. దీంతో చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఎన్ని విమర్శలు చేసినా అవి ‘బూమ్ రాంగ్’ అవుతున్నాయి తప్ప, వారికి చేకూరే రాజకీయ ప్రయోజనం శూన్యం. అలాగని బాబును కాస్త పక్కన పెడతారా? అంటే దానికి ఆస్కారం లేదు. ప్రెస్ మీట్ పెడితే అది చంద్రబాబును తిట్టాడనికేనని మీడియా వర్గాలు కూడా ముందుస్తుగా ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. అందుకే అంటారు… వెయ్యి మంది మగవాళ్లకైనా సమాధానం చెప్పవచ్చు గానీ, ఒక మహిళకు మాత్రం చెప్పలేమని!