roja happy about court comments ఏపీ అసెంబ్లీ నుండి తనను సస్పెండ్ చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల పట్ల రోజా సంతోషం వ్యక్తం చేసారు. ఈ కేసుకు హైకోర్టు పరిధిలోనే న్యాయం జరుగుతుందని, వెనువెంటనే హైకోర్టు విచారణ చేసే విధంగా ఆధారాలు ఇస్తామని, బుధవారం నాడు ఏపీ హైకోర్టులో దీనిని విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో తనను పాల్గొనేలా తీర్పు ఇవ్వాలని రోజా తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తికి హైకోర్టు జవాబిస్తుందని సుప్రీం స్పష్టం చేయడంతో వైసీపీ వర్గాల్లో ఆశలు చిగురించాయి.

అయితే బుధవారం ఉదయమే ఈ కేసు విచారణకు వస్తుందన్న సమాచారంతో రోజా వెల్లడించిన సంతోషం ఎప్పటివరకు ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు హైకోర్టు అసలు విచారణకు స్వీకరించకపోవడంతోనే రోజా సుప్రీం తలుపు తట్టాల్సి వచ్చింది. సుప్రీంలో కూడా ఒక బెంచ్ విచారణకు స్వీకరించక పోవడంతో, నిరాశలో ఉన్న రోజాకు నేడు మరో బెంచ్ చేసిన వ్యాఖ్యలు కొంత ఊరటనిచ్చాయి. మరి ఇన్ని పరిణామాల నేపధ్యంలో రేపు విచారణకు రానున్న హైకోర్టులో రోజా భవిష్యత్తు తేలనుంది.