roja-comments-on-pawan-kalyan at chintalapudiఅసెంబ్లీ లో తను చేసిన వాగ్ధాటికి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన రోజా, ఇప్పటికీ తన మాటల దూకుడును ఆపడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడిలో పర్యటించిన రోజా ‘జనసేన’ అధినేత పవన్ మొదలుకొని స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత వరకు విమర్శలతో ముంచెత్తింది.

‘పవన్ కళ్యాణ్ ప్రచారం, బిజెపి లేకపోతే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కేవి కాదని, ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షలు పై చిలుకు మాత్రమేనని, ‘రాజన్న రాజ్యంలో ప్రతి ఇంతా సౌభాగ్యం… చంద్రన్న రాజ్యంలో ప్రతి ఇంటా దౌర్భాగ్యం’ ఉందని, అయినా కూడా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ పవన్ పై ఒత్తిడి తెచ్చే మాటల తూటాలు పేల్చారు.

‘త్వరలో కాబోయే సిఎం తానేనంటూ’ వ్యాఖ్యానించడం జగన్ కు ఎంత పరిపాటిగా మారిందో రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం 5 లక్షలేనని మాట్లాడడం రోజా వంతయ్యింది. బహుశా ఈ సారి ప్రజలు ఓట్లు వేసే సమయంలో ఇంకాస్త ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి, ఆ అయిదు లక్షల సంఖ్యను మరింతగా పెంచమని వైసీపీ వర్గాలు ప్రజలకు సంకేతాలు ఇస్తున్నట్లుగా కనపడుతోంది.