Robo 2.0 release dateగత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న శంకర్ – రజనీకాంత్ ల “రోబో 2.0” రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు దర్శకుడు ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని, విఎఫ్ఎక్స్ కంపెనీలు డెలివరీ డేట్ ను ఇచ్చాయని స్పష్టం చేసారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల ఊహాగానాలు వినిపించిన నేపధ్యంలో… ఈ ఏడాదిలోనే రిలీజ్ డేట్ ప్రకటించడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే అంశం.

అయితే ఇప్పటివరకు ఇలా చాలా సార్లు రిలీజ్ డేట్లు ప్రకటించి, వాయిదాలు వేయడం అనేది జరుగుతూ వస్తోంది. కనీసం ఈ సారైనా చెప్పిన మాట మీద నిలబడితే మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంటుంది. గతంలో పడిన వాయిదాలతో ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు కూడా అంచనాలు వదిలేసుకున్నారు. కనుక మంచి అవుట్ పుట్ తో గనుక సినిమా వస్తే, అనితర సాధ్యమైన రికార్డులకు అవకాశం ఉంటుంది. మరోసారి వాయిదా పడితే గనుక, ఇక అంతే సంగతులు!