2 point 0 teaser talkవాయిదాలు పడుతూ వస్తోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ – శంకర్ ల “2.0” సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ఆ అంచనాలను రెట్టింపు చేసేలా మొదటి టీజర్ ప్రేక్షకులను పలకరించింది. సిల్వర్ స్క్రీన్ పై శంకర్ ‘విజువల్ వండర్’ ఖాయం అన్న అభిప్రాయాన్ని ఈ ఫస్ట్ టీజర్ కలిగించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

విలన్ గా నటించిన అక్షయ్ కుమార్ ను అంతమొందించడానికి, మళ్ళీ ‘చిట్టి’ని రంగంలోకి దించి ఎలాంటి సాహాసకృత్యాలు చేసారు అన్నదే సినిమా ప్రధాన కధగా కనపడుతోంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బూరపరిచే విధంగా రూపుదిద్దుకున్నాయన్న నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది. ఈ విజువల్ వండర్ కు రెహమాన్ సంగీతం, నిరవ్ షా ఫోటోగ్రఫీ తోడయ్యాయి.

‘రోబో’ మొదటి పార్ట్ ఎలా అయితే పిల్లలను అమితంగా ఆకర్షించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ధియేటర్లకు రప్పించిందో, ఈ “2.0” కూడా అదే రూట్ లో పయనిస్తుందన్న సంకేతాలను ఇచ్చింది. ఈ టీజర్ తర్వాత ధియేటిరికల్ ట్రైలర్, సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా? అని అనుకోవడం సినీ ప్రియులకు సహజమే. గెట్ రెడీ ఫర్ శంకర్ అండ్ చిట్టి స్క్రీన్ షో!