Sonia Gandhi -Robert Vadra- Priyanka Gandhiతన అత్త సోనియా గాంధీ అధ్యక్షతన అధికారంలో ఉన్న యూపీఏ సర్కారును అడ్డం పెట్టుకుని, దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని హర్యానాలో పెద్ద ఎత్తున భూములను నొక్కేసిన ఆరోపణలను పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వాద్రా భూముల కొనుగోలు, ఆ తర్వాత అదే భూములతో ఆయన చేసిన వ్యాపారాల్లో అక్రమాలేమైనా ఉన్నాయా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఏర్పాటైన ధింగ్రా కమిటీ తన నివేదికను హర్యానా ప్రభుత్వానికి అందజేసింది.

ఈ నివేదికలో వాద్రా అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయని ఈ సందర్భంగా జస్టిస్ ధింగ్రా మీడియాకు వెల్లడించారు. దాదాపు 182 పేజీలతో కూడా సుదీర్ఘ నివేదికను హర్యానా సర్కారు చేతిలో పెట్టారు. సోనియాగాంధీ అల్లుడు చేసిన అక్రమాలుగా దేశ రాజకీయాల్లో ఈ నివేదిక పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. వాద్రాపై అపనిందలు వేసేందుకు బీజేపీ సర్కారు యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ నిరసన గళం విప్పగా… రాజకీయ విద్వేషం కాంగ్రెస్ సొత్తుగా బీజేపీ ప్రతిస్పందించింది. ఈ ఆరోపణల పర్వం ఎలా ఉన్నా… సోనియా అల్లుడు భాగోతాలు బయటపడడం యూపీఏ పాలనకు అద్దం పడుతోంది.