Narendra-Modi-ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాల నుండి ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారు బీజేపీ వారు. సాక్షాత్తు ప్రధానే సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. బలహీనవర్గాలకు చెందిన ఒక పెద్ద వ్యక్తి దేశ ప్రధానిగా ఉండడాన్ని కాంగ్రెస్ భరించలేకపోతోందని ఆయన ఇటీవలే కాలంలో ఎక్కువగా వాడటం మనం చూస్తూ ఉన్నాం.

ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా అదే పల్లవి అందుకున్నారు. అయితే ఈ సెంటిమెంట్ కార్డు బీజేపీని వచ్చే ఎన్నికలలో కాపాడుతుందో లేదో చూడాలి. నిజానికి ప్రధాని మోడీ పెద్దవాడనో లేక బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి అనో ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో ప్రధానిని చెయ్యలేదు. గుజరాత్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయనను అందలం ఎక్కించారు.

కాంగ్రెస్ చేస్తున్న అవినీతికి విసిగిపోయిన జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఎప్పుడు ఆయన కులం గురించి వారు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో చూసి 2019లో ఓట్లు వేస్తారు గానీ ప్రధాని ఎంత సెంటిమెంట్ పండించినా దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని వారు గ్రహిస్తే మంచిది.