Rishi kapoor Buys Award For 30000బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ అభిమానులు, ప్రేక్షకులు ఖంగుతినే ఒక విషయాన్ని బయటపెట్టారు. 1973లో ‘బాబీ’ సినిమాతో హీరోగా పరిచయమైన రిషి కపూర్, ఆ చిత్రానికి 1974లో ఉత్తమ నటుడిగా ‘ఫిలిం ఫేర్’ అవార్డును పొందారు. అయితే ఆ ‘ఫిలిం ఫేర్’ అవార్డు తనకు ఎలా దక్కిందనే విషయం గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

30 వేలు పెట్టి ఈ అవార్డును తాను కొనుక్కున్నానని, ఆ తర్వాత, ఈ పని చేసినందుకు తాను చాలా సిగ్గుపడ్డానని, మరెప్పుడూ ఇటువంటి పని చేయలేదని అన్నారు. రిషికపూర్ ఆత్మకథతో కూడిన ‘ఖుల్లం ఖుల్లా’ పుస్తకాన్ని ఇటీవల ప్రచురించగా, ఈ నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రిషికపూర్ బయటపెట్టారు. రిషికపూర్ చేసిన ఈ ప్రకటనపై నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది.