right-time-for-kcr-to-show-his-caliber-in-national-politicsసుప్రీంకోర్టు ఆదేశానుసారం రేపు బల నిరూపణలో విజయం కోసం బీజేపీ కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండటంతో ఆ రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేసిన జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పోలీసులు గురువారం ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడకు పాల్పడిందని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆరోపించాయి. అనంతరం రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముందుగా కేరళకు ప్రత్యేక విమానంలో తరలించాలని అనుకున్నాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్‌ మార్చారు.

ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య హైదరాబాద్ తరలించారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నోవాటెల్‌ హోటల్‌కు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు.

ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఒకవేళ బీజేపీ రేపు ఓటమి చెందితే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ పరపతి పెరుగుతాదని, ఆయన ఫెడరల్ ఫ్రంట్ కు ఆధారణ లభిస్తుంది తెరాస వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చూడాలి రేపు ఏం జరగబోతుందో!