RIGHT-RIGHT-TELUGU-MOVIE-TEASER-talkకొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన “శ్రీమంతుడు” సినిమాలో ఇంటర్వెల్ సీన్ మహేష్ చెప్పిన ఓ డైలాగ్ తో ముగుస్తుంది. ఇప్పుడు ఆ డైలాగే ఓ సినిమాకు ‘టైటిల్’ అయ్యింది. ఫైట్ అయిపోయిన తావత బస్సెక్కి “రైట్ రైట్” అంటూ జోష్ అయిన డైలాగ్ తో ‘శ్రీమంతుడు’ సినిమా ఇంటర్వెల్ ముగిసిన విషయం తెలిసిందే.

తాజాగా సుమంత్ అశ్విన్ హీరోగా మను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రైట్ రైట్” సినిమా తొలి టీజర్ విడుదలైంది. బస్సులో కండక్టర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్రైమ్ కామెడీగా రూపుదిద్దుకుంది. అశ్విన్ కు జంటగా పూజ జావేరి నటిస్తుండగా, ‘బాహుబలి’ కాలకేయ ప్రభాకర్ కు సినిమా ఆద్యంతం హీరో గారి పక్కనే ఉండబోతున్నారు. రొటీన్ తెలుగు సినిమా మాదిరే కనపడుతున్న ఈ సినిమా ట్రైలర్ లో హీరో గారి పాత్ర కొత్తగా కనపడుతుండగా, షూటింగ్ లొకేషన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి.