Rhea Chakrabortyగత కొన్ని రోజులుగా బికినీ ఫోటోలతో తన ఇంస్టాగ్రామ్ లో సందడి రియా చక్రబోర్తి, ఇప్పట్లో ఈ బికినీ ఫోటోల పరంపరను వదిలేలా లేదు. తన హాట్ హాట్ బికినీలతో హల్చల్ చేస్తోన్న ఈ బ్యూటీ, తాజాగా వైట్ టాప్ తో కూడిన టూ పీస్ కాస్ట్యూమ్స్ ఫోటోను పోస్ట్ చేసింది. తెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమాలో సుమంత్ అశ్విన్ సరసన కనిపించిన రియా, ఇటీవలే బాలీవుడ్ లో నటించిన ‘జలేబి’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లకు అందుబాటులో ఉంటోంది. తెలుగులో ఒకటి, హిందీలో నాలుగైదు సినిమాలు చేసినా, ఒక్క సక్సెస్ కూడా దరిచేరకపోవడంతో అవకాశాలు దూరమయ్యాయి. బహుశా ఈ హాట్ హాట్ బికినీ కాస్ట్యూమ్స్ వలనైనా మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీ ఖాతాలో పడతాయే లేదో గానీ, ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫాలోయర్స్ సంఖ్యను మాత్రం పెంచుకుంటోంది.