Rhea Chakrabortyబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో జైలు కు వెళ్లాల్సి వచ్చింది. దివంగత నటుడికి డ్రగ్స్ అందించిన ఆరోపణలను ఆమె ఎదురుకుంటుంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసిన తరువాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) వారాలపాటు ఆమెను విచారించింది.

నటి సారా అలీ ఖాన్ గురించి రియా సంచలనాత్మక విషయాలు వెల్లడించిందని ఎన్‌సిబి దాఖలు చేసిన చార్జిషీట్‌ లో వెల్లడైంది. ఒక ప్రముఖ ఛానల్ దానిని సంపాదించి అందులోని షాకింగ్ విషయాలు బహిరంగపరచింది. రియా మరియు సారా కొన్నేళ్లుగా సన్నిహితులట. వారు తరచూ కలిసేవారని చెప్పుకొచ్చింది.

సారా అలీ ఖాన్ తనకు వోడ్కా మరియు గంజాయిని ఇచ్చేదని రియా తన స్టేట్మెంట్ లో తెలిపింది. నొప్పి నివారణ (పెయిన్ రిలీఫ్) కోసం సారా గంజాయి ఐస్ క్రీంలో కలిపి తీసుకునేదని రియా చెప్పిందట. సారా గంజాయి ని చుట్టి సిగరెట్ మాదిరి తీసుకునేదని, తనకు కూడా అలవాటు చేసిందని దర్యాప్తులో వెల్లడించిందట.

ఇది ఇలా ఉండగా… ఈ కేసులో రియా బెయిల్ పై విడుదలయ్యింది. బాలీవుడ్‌లో తిరిగి అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆమె. ఇక పోతే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే సుశాంత్ పీఆర్ మానేజర్ ని హైదరాబాద్ లో అరెస్టు చేసి ప్రశ్నిస్తుంది డిపార్ట్మెంట్.