RGV-Kamma-Rajyam-Lo-Kadapa-Reddluరామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు ఇప్పుడు కష్టకాలం మొదలైనట్టుగా ఉంది. కోర్టు ఇప్పటికే ఈ నెల 29న విడుదల కావాల్సిన సినిమాపై స్టే ఇచ్చింది. తాజాగా సినిమాకు సెన్సార్ కష్టాలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ లోని రీజినల్ సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం.

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా టైటిల్ మార్చిన సినిమాలోని చాలా సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే కట్స్ కు రామ్ గోపాల్ వర్మ ఒప్పుకోకపోవడంతో వారు సినిమాను రీవైజింగ్ కమిటికి సిఫార్సు చేశారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ట్రైలర్లను బట్టి చిత్రంలో చంద్రబాబు, లోకేషులను టార్గెట్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది.

అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇది కలిపిత గాథ అంటూ అటు కోర్టులోనూ సెన్సార్ బోర్డు ముందూ వాదించడం గమనార్హం. ఈ తంతంగమంతా పూర్తి చేసి కొత్త రేలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. కావాలని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేసిన రామ్ గోపాల్ వర్మ కు తగిన శాస్తి జరిగిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల తరువాత అధికార పక్షం వారు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్న తరుణంలో ఇటువంటి సినిమా తీయడం అంటే ఖచ్చితం గా అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే. ఇది ఇలా ఉండగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్ కూడా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.