Sri-Reddy-Drama-like-Hollywood-Script!కాస్టింగ్ కౌచ్ పై ప్రసారం చేసిన మీడియాలను పక్కన పెడితే… ఈ అంశం ప్రస్తుతం ‘పవన్ కళ్యాణ్ – శ్రీరెడ్డి – కరాటే కళ్యాణి’ల ట్రయాంగిల్ రివెంజ్ స్టోరీలా మారిపోయింది. ఓ పక్కన అన్న శ్రీరెడ్డితో పాటు అనిపించిన వర్మ, ప్రసారం చేసిన మీడియాలను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయగా, తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

“తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని, తనను ఎవరూ వెనకుండి నడిపించడం లేదని, పోరాటాలు చేస్తున్నట్టు నటించడం తనకు చేతకాదని ఎద్దేవా చేసింది. అసలు ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో అందరూ గమనిస్తున్నారని పేర్కొంది. మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకూ అంతేనని, తమని అన్నప్పుడు, తమ తల్లులను దూషించినప్పుడు, రోడ్డు మీద పడి రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్ దాడులకు తెగబడుతున్నప్పుడు తమ బాధ అర్థం కాలేదా?

తాను అన్నింటికీ సిద్ధపడే పోరాటంలోకి దిగానని, ప్రాణాలకు సైతం లెక్క చేయనని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. పవన్ తన ఆధిపత్యాన్ని సినిమాల్లో చూపించాలని, ఫిలిం చాంబర్ పైన కాదని, జర్నలిస్టుల జోలికి రావద్దని హెచ్చరించింది. ఏదో ఒకరోజ నిజాలు బయటకు వస్తాయని, ఒకరోజు హడావుడికి భయపడబోనని, తాను ఎవరినీ వదిలిపెట్టబోనని” మరోమారు హెచ్చరించింది శ్రీరెడ్డి.

ఇదిలా ఉంటే… శ్రీరెడ్డిపై కరాటే కళ్యాణి యుద్ధం ప్రారంభించింది. ‘కళ్యాణి లీక్స్’ పేరిట (truths) మొదలయ్యాయని, పెళ్లి కాని విమల (శ్రీరెడ్డి) కు ఇంత పెద్ద కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతోంది. మొన్ననే ఆ చదువు కూడా పూర్తైపోయింది. విమల (శ్రీరెడ్డి) కు కుటుంబంతో 10 సంవత్సరాల నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్‌ పల్లిలో లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువగల ఫ్లాట్ లో, తల్లితో కలిసి ఎలా గృహప్రవేశం చేసింది?

ఖరీదైన కార్లలో తిరగడానికి, ఆ ఫ్లాట్ కొనడానికి డబ్బులెలా వచ్చాయో ఏంటో విమలా నీకే తెలియాలి. ఇంకొన్ని విషయాలను నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తాను. ఎందుకంటే నా లీక్స్ నా ఇష్టం అంటూ కరాటే కల్యాణి పేర్కొంది. ఇక పవన్ ఆరోపించిన ఏబీఎన్ ఛానల్ అయితే పవన్‌పై న్యాయ పోరాటం చేయాలని, ఇందులో భాగంగా క్రిమినల్ కేసుతో పాటు 10 కోట్లకు పరువునష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నాట్లుగా తెలుస్తోంది.

ఇక విషయం ఇంతదాకా రావడానికి కారణమైన వర్మ… “నేను చేసిన పనికి సారీ చెప్పి, పీకే మీద ఇక కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేశాను. ఆ తరువాత కూడా నేను… సీబీఎన్, లోకేశ్, శ్రీనిరాజు, ఆర్కే, రవి ప్రకాష్, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా మదర్ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను” అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.