RGV---NTR-Biopicహ..హ..హ మళ్లీ అదే సీన్. ఇంకేం ఉంది రోబో 2.0 తో మీ సినిమా వస్తుంది మీకు భయం లేదా? అని మీడియా ప్రశ్నించినప్పుడు బిగ్గరగా మాట్లాడుతూ అది చిన్న పిల్లల సినిమా, మాది కుర్రాళ్ళు చూసే సినిమా అంటూ భారీ బిల్డ్ అప్ ఇచ్చాడు మన ఆర్జీవీ బాబాయి. అయితే కొందరు ఆర్జీవీ ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తున్నాడు అని అనుకున్నప్పటికీ, మరి కొందరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటే, నిజమేనేమో సినిమాలో మంచి కంటెంట్ ఉందేమో, ఆ మధ్య సంక్రాంతి బరిలో రెండు కొదమ సింహాలు చిరు-బాలయ్య మధ్యలో వచ్చి హిట్ కొట్టిన దిల్ రాజులా, రోబోతో పాటు బరిలోకి దిగి హిట్ కొట్టబోతున్నాడు మన బిల్డ్ అప్ బాబయ ఆర్జీవీ అని అనుకున్నారు. కట్ చేస్తే కధ షరా మామూలే. ఆర్జీవీ మళ్లీ తన టాలెంట్ చూపించాడు. తన గత సినిమాల్లో లాగానే తుస్సు మనిపించాడు.

తాజాగా ట్విట్టర్ లో స్పందిస్తూ కొన్ని సెన్సర్ ఇష్యూస్ వల్ల, తమ సినిమాను తెలంగాణా ఎన్నికల రోజు విడుదల చెయ్యనున్నాం అని, తమ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చావు కబురు చల్లగా చెప్పాడు. అయితే ఆర్జీవీ ఇది కొత్త ఏం కాదు ఇదంతా ఒకరకంగా పబ్లిసిటీ స్టంట్ లో భాగం అనే చెప్పాలి. అయితే ఆర్జీవీ పెట్టిన ట్వీట్ కి కొందరు మంచి నిర్ణయం తీసుకున్నావ్ అని అంటూ ఉంటే, మరి కొందరు ఆయనకి కౌంటర్ ఇస్తా, పోనీలే నువు సినిమా వాయిదా వేసి రజనీకాంత్ రోబో 2.0 సినిమా కాపడావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఆడియో వేడుకలో కుర్రకారు టార్గెట్ గా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న విధంగా చేశాయి అనే చెప్పాలి.

కానీ ఊరించి ఊరించి ఉసూరుమనిపించాడు అన్నట్లుగా, పాపం ట్రైలర్ తో వీడియో సాంగ్స్ తో కుర్ర కారును ఊరించి చివరకు సినిమా వాయిదా వేసి, వారి ఆశలపై నీళ్ళు చాల్లాడు. మొత్తంగా చూసుకుంటే వర్మ ఇక్కడ కూడా భయంతో కూడిన భాద్యతతో వ్యవహరించాడు అని ఫీల్ అవ్వడమే..ఎందుకంటే ఒకవేళ ఆయన సినిమా వాయిదా వేసుకోకపోతే, పాపం రజని పరిస్థితి ఏంటో అని తలచుకుంటేనే భయం వేస్తుంది అంటూ శెటైర్స్ వేస్తున్నారు ట్విట్టర్ యూజర్స్. ఏదైతేనే మొత్తానికి ఆర్జీవి సినిమా తెలంగాణాలో ఎలెక్షన్స్ రోజు విడుదల కానుంది.