I-Don't-Believe-Balayya-in-NTR's-Role---Ram-Gopal-Varmaవివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మర్చి 22న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా గురించి రాము కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్ని పుకార్లని చిత్రయూనిట్ కొట్టిపారేశారు.

అయితే ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడా? అనే అనుమానాలు ఉన్నాయి. గతంలో సినిమాకు క్రేజ్ రావడానికి ఈ చిత్ర హక్కులు భారీ లాభానికి అమ్మేశామని నిర్మాతలు ఒక లీక్ ఇచ్చారు. హైప్ సంగతి తరువాత సినిమా అమ్ముడు పోయింది అనుకుని ఎవరూ రావడం లేదట. దీనితో ఖంగు తిన్న నిర్మాతలు సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్ని పుకార్లని చిత్రయూనిట్ కొట్టిపారేశారు. రాము అయితే ఏకంగా నిర్మాతల నంబర్లు ట్విట్టర్లో పెట్టి కావలసిన వాళ్ళు సంప్రదించండి అన్నట్టు రాసారు.

1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అది టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా. మర్చి 22 విడుదల అంటే ఆ టైమ్‌కి ఎన్నిక‌ల కోడ్ కూడా వ‌స్తుంది. మ‌రి ఎన్నిక‌ల టైమ్‌లోరిలీజ్‌కి ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ప‌ర్మిష‌న్ కావాల్సి ఉంటుంది. అయితే దీనికంటే ముందు అసలు సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఎటువంటి క‌ట్స్ లేకుండా ఇది సెన్సార్ కావ‌డం అంత ఈజీ కాదు. దీనితో బయర్లు సినిమా కొనడానికి సాహసించరు. సెన్సార్ ప‌రంగానూ, ఎన్నిక‌ల సంఘంతోనూ వ‌ర్మ చిక్కులు మధ్య సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి. పైగా ఏపీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీఆర్ మహానాయకుడు ఫెయిల్యూర్ తరువాత ఈ చిత్రానికి కొంచెం హైప్ వచ్చిన మాట వాస్తవమే. దానిని సొమ్ము చేసుకోవడానికి భారీ రేట్లు చెబుతున్నారు నిర్మాతలు. దీనితో ఈ చిత్రం విడుదలకు ఇబ్బందులు ఉన్నాయి.