RGV God Sex Truth 2 shooting started‘గాడ్, సెక్స్, ట్రూత్’ అంటూ ఇటీవల రచ్చ రచ్చ చేసిన రాంగోపాల్ వర్మ, దీనికి సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి పార్ట్ లో మియా మాల్కొవాతో తీసిన వర్మ, రెండవ పార్ట్ లో ఎవరిని చూపిస్తారో అన్న సందేహం నెలకొంది. అయితే రెండవ పార్ట్ లో కూడా మియా మాల్కొవా అందాలనే చూపించబోతున్నారనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి పార్ట్ లో అంతా ఓపెన్ అయిపోతే, ఇంకా రెండవ పార్ట్ లో చూపించడానికి ఏముంది? అనుకుంటున్నారా?

అందుకే లొకేషన్ చేంజ్ చేసారు వర్మ. ఇటీవల రిలీజ్ అయిన ‘గాడ్, సెక్స్, ట్రూత్’ అంతా ఇన్ డోర్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. బాత్ టబ్ మరియు ఓ ప్రైవేటు రూమ్ లో ఈ షూటింగ్ చేయగా, రెండవ పార్ట్ ను మాత్రం అవుట్ డోర్ లో షూట్ చేయబోతున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని వర్మే, తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఓ ఐలాండ్ లో ఈ రెండవ పార్ట్ షూటింగ్ జరగబోతోందని స్పష్టం చేయడంతో, మరోసారి వర్మ రచ్చ ప్రారంభం కాబోతోందన్న మాట.