mega-familyనిర్మొహమాటంగా మాట్లాడడంలో గానీ, తానూ అనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో గానీ రాంగోపాల్ వర్మను మించిన వారు లేరు అని చెప్పడంలో సందేహం లేదు. అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఇచ్చారు వర్మ. ఈ ముఖాముఖి కార్యక్రమంలో మెగా అభిమానులను ఏకిపారేస్తూ ‘కడుపు మంట’ మిగిల్చిన వర్మ, ప్రిన్స్ అభిమానులకు మాత్రం ‘విందు భోజనం’ లాంటి వ్యాఖ్యలు చేసారు.

“మెగా అభిమానులకు అరవడమే గానీ, మాట్లాడడం రాదని ఎటకారంగా మాట్లాడిన వర్మ, నటుడిగా మహేష్ ను ఆకాశానికెత్తేస్తూ ప్రిన్స్ అభిమానులను బుట్టలో వేసుకున్నారు. ఒక నటుడిగా మహేష్ స్క్రీన్ ప్రజన్స్ అద్భుతమని చెప్పిన వర్మ, సపోర్టింగ్ కాస్ట్ సహాయం లేకపోయినా సినిమాను ఒంటి చేత్తో నిలబెడతాడని, మహేష్ ను తప్ప ఈ తరంలో అంత గొప్ప నటుడ్ని నేను చూడలేదని, అందరి కంటే ఎత్తులో మహేష్ ఉన్నాడని” వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

జనవరి 1 తర్వాత టాలీవుడ్ ని వీడిపోతానని ప్రకటించిన వర్మ, బహుశా తన చిట్టచివరి పంచ్ ను మెగా అభిమానులకు, ప్రశంసలను ప్రిన్స్ అభిమానులకు అందించారేమో! “కిల్లింగ్ వీరప్పన్” విడుదల మరికొద్ది గంటల్లో ఉందనగా చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? మెగాభిమానులు వింటున్నారా!?