review on Hyderabad Old City 20172017 పాతబస్తీ చరిత్రలో ఒక రకంగా చాల స్పెషల్ అనే చెప్పుకోవాలి. గత రెండు దశాబ్దాలలో మొదటి సారిగా ఈ ఏడాది ఒక్క అల్లరి కూడా జరగలేదు. రాళ్లు విసరడం, గుంపులుగా జమ అయి నిరసనలు తెలపడం వంటివి గతంలో చాలా సాధారణంగా కనిపించేవి. అయితే ఈ సంవత్సరం అటువంటివి ఏమి లేవు.

అక్కడ ప్రజల మైండ్ సెట్ లో మార్పు కారణంగానో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన ఉత్తమ పోలీసింగ్ వల్లనో అని చెప్పవచ్చు. గతంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా, అంతర్జాతీయ పరిణామాలు, క్రికెట్ వంటివి ఏమి జరిగినా పాతబస్తీలో ఏదో ఒక గొడవ జరుగుతుండేది అయితే ఈ ఏడాది అటువంటిది లేదు.

2016లో గత ఏడాది స్థానిక ఎన్నికలలో కొన్ని చోట్ల రాళ్లు విసిరిన ఘటనలు జరిగాయి. అలాగే మతపరమైన అంశంలో ఒక వివాదం వచ్చినప్పుడు కూడా గొడవ జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒక మతపరమైన విషయంలో వివాదం ఏర్పడిన కొందరు పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు.

పాతబస్తీలో అక్షరాస్యత శాతం పెరగడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రభుత్వం మరి కాస్త దృష్టి పెడితే ఆ ప్రాంతానికి ఇంకాస్త మంచి చేసినవాళ్లు అవుతారు. ఇది ప్రజలలో వచ్చిన మార్పైనా లేకపోతే పోలీసులు చేపట్టిన చర్యల వాళ్ళైనా ఇది ఖచ్చితంగా అక్కడి ప్రజలకు మంచి చేసేదే.