Revanth Reddy supporting bjpఎన్నికలలో ఘోరపరాజయం తరువాత కూడా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ కొనసాగాలనే డిమాండ్‌ పార్టీలో రోజురోజుకు పెరుగుతోంది. రాహుల్‌గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ నేతలు పలు విధాలుగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ సహా వంద మందికి పైగా నేతలు రాహుల్‌గాంధీ రాజీనామాకు నిరసనగా తమ పదవులకు శుక్రవారం రాత్రి రాజీనామాలు చేశారు.

తాజాగా ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా చేరారు. గతంలో టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాకా ఆ పార్టీ భజన బృందంలో చేరిపోయి ఆ పార్టీ సంస్కృతి అలవర్చుకుంటున్నారు. అయితే రెండు పర్యాయాల ఘోర పరాజయం తరువాత కూడా కాంగ్రెస్ లో ఓటమికి ఎవరూ బాధ్యత లేకుండా రాజీనామాల డ్రామాకు కొనసాగించడం విశేషం.

అయితే ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. నల్గొండ పార్లమెంట్ కు ఎన్నికవ్వడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. అక్కడ తొందరలో ఉపఎన్నిక జరగబోతుంది. ఆయనను పీసీసీ ప్రెసిడెంట్ పదవి నుండి కూడా మారుస్తారని ప్రచారం ఉంది. ఈ సమయంలో రాహుల్ గాంధీని కాకా పట్టి ఆ పదవి పట్టాలని నేతలంతా ఈ రాజీనామాల పర్వానికి శ్రీకారం చుట్టారు. జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి రేస్ లో ముందు ఉన్నట్టు తెలుస్తుంది.