Revanth Reddy  Resignation to MLA postతెలుగుదేశం నుండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి వ్యవహారం తెలివిగా ఉంది. అటు రాజీనామా చేసినట్లు కనిపించాలి. ఇటు అది ఆమోదం పొందకూడదు అన్న విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. అమరావతి వెళ్లి చంద్రబాబు ఆఫీస్ లో రాజీనామా సమర్పించిన రేవంత్ ఆ తర్వాత వెంటనే తెలంగాణ శాసనసభ స్పీకర్ మదుసూదనాచారికి సమర్పిస్తారని అనుకున్నారు.

కాని ఆయన అలా చేయలేదు. ఈ విషయంలో సొంత పార్టీ నుండే రేవంత్ కు విమర్శలు ఎదురవుతున్నాయి. రేవంత్ ను హీరో అన్నారుగా,బాహుబలి అన్నారుగా..ఏమైంది రాజీనామా అని అడుగుతున్నారు. అయితే దీనికి కారణం కాంగ్రెస్ హై కమాండ్ అని రేవంత్ అనుచరులు చెప్తున్నారు.

రేవంత్ రాజీనామా చేయాలని అనుకున్నా, ఎఐసిసి స్థాయిలో తొందరపడవద్దని అన్నారని, అందుకే వేచి ఉన్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ కూడా అప్రతిష్ట తెచ్చి పెట్టుకున్నట్టే. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శిస్తుంటారు.

అద్వాన్నపు,అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహించారని వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తాను కూడా అలాంటి దిక్కుమాలిన ఫిరాయింపునే అంగీకరించినట్లు అవుతుంది. అన్ని పార్టీలు ఒక తానులో ముక్కలే అని నిరూపించినట్టు అవుతుంది. ఈ వ్యవహారం వాళ్ళ రేవంత్ కు రాజకీయంగా ఇబ్బంది కూడా!