Revanth Reddy leaving congress partyకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవును అనే అంటున్నారు సన్నిహితులు. ఇటీవలే శాసనసభ ఎన్నికలలో మహాకూటమి ఓటమి, సొంత ఓటమి రేవంత్ రెడ్డికి షాక్ లా తగిలాయి. కాంగ్రెస్ లో సీనియర్ల పెత్తనం ఎక్కువయ్యి రేవంత్ రెడ్డి ఎదుగుదలకు అడ్డుగా ఉంటున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. పై పెచ్చు ఆపరేషన్ ఆకర్ష పేరుతో కాంగ్రెస్ ని మరిన్ని తూట్లు పొడుస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ఈ క్రమంలో బీజేపీలో చేరితే ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని పార్టీ హై కమాండ్ హామీ ఇచ్చిందట. గతంలో రేవంత్ రెడ్డి బీజేపీతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. బీజేపీకి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఓటుకు నోటు కేసు నుండి కూడా ఉపశమనం లభిస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే బీజేపీలో చేరడం అనేది రేవంత్ రెడ్డికి ఆత్మహత్య సదృశ్యం కావొచ్చు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ విషయం బోధ పడుతుంది.

బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు సాధించింది. నామమాత్రంగా 7% ఓట్లు సంపాదించగలిగింది. 118 స్థానాలలో 103 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘోరంగా ఓడిపోయారు. సొంత నియోజకవర్గమైన ముషీరాబాద్ లో మూడవ స్థానంలో ఉండిపోయారు ఆయన. అటువంటి పార్టీలో చేరితే రేవంత్ రెడ్డి రాజకీయ అస్తిత్వానికే ముప్పు రావొచ్చు. నిన్న తెలంగాణాలో జరిగిన రాహుల్ గాంధీ మీటింగుకి రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం విశేషం.