Revanth Reddy Future plans in congress partyటిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ కావడం దాదాపుగా ఖరారు ఐనట్టే. ఇకపోతే రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రేవంత్ టిడిపి నుంచి వైదొలగే సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారట.

ఉప ఎన్నికలో కాంగ్రెస్ టిక్కెట్ పైన గెలిచి ,టిఆర్ఎస్ కు బ్రేక్ వేస్తే ఆ పార్టీకి ఊపు వస్తుందని కూడా ఆయన అనుకుంటున్నారట. మరో వైపు వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుండి కాకుండా కాంగ్రెస్ తరపున జడ్జర్ల నుంచి పోటీచేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జడ్జర్ల కు మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్నారు.

టిఆర్ఎస్ కు కంచుకోట ల ఉన్న జడ్జర్లలో ప్రస్తుతం మాజీ విప్ మల్లు రవి కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉన్నారు.ఆయనను తప్పించి రేవంత్ కు టికెట్ ఇవ్వవలసి ఉంటుంది. ఐతే మల్లు రవి మాత్రం తనకు జడ్జర్ల సీటు కావాలని పట్టుబడుతున్నారట. సామాజిక వర్గాల నేపధ్యంలో రేవంత్ వైపు కొందరు నేతలు మొగ్గు చూపుతున్నారు.

ఐతే ఇక్కడ పోటీ చేస్తే రేవంత్ స్థానికుడు కాకపోవడం ఆయనకు వ్యతిరేకంగా పనిచెయ్య వచ్చు. పైగా మల్లు రవి కాంగ్రెస్ సీనియర్ నేత ఆయన్ని తప్పించి ఇప్పుడే పార్టీలోకి చేరిన రేవంత్ రెడ్డి కి ఆదిష్టానం ప్రాధాన్యత ఇస్తారా అనేది చూడాలి. ఐతే దీనిపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, స్థానికుడు కాకపోతే కల్వకుర్తిలో ఎన్.టి.రామారావునే ఓడించారని,రేవంత్ ఎంత అని వ్యాఖ్యానించారు. వచ్చే పదేళ్లు టిఆర్ఎస్ దే అదికారం అని ఆయన అన్నారు.