Revanth Reddy fires on Trs Governmentతెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తరుచుగా వివాదాలలో ఉండే అంశం ‘డ్రగ్స్ వినియోగం.’ గడిచిన రెండు రోజులుగా హైదరాబాద్ పుండింగ్ క్లబ్ లో డ్రగ్స్ వినియోగం., ప్రముఖుల పిల్లలు పట్టివేతతో మొదలైన రచ్చ ఇప్పుడు అధికార – విపక్షాల మధ్య మాటల మత్తుని అందిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులు అంటే, మీరు అంటూ ఒకరిపై మరొకరు విమర్శలతో రెచ్చిపోతున్నారు.

డ్రగ్స్ వినియోగంలో తన బంధువుల మీద వస్తున్న ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెరాస నాయకులు ఆరోపించినట్లు తమ బంధువుల డ్రగ్స్ వినియోగంపై ఎటువంటి టెస్టులకైనా నేను సిద్ధమని., అలాగే కేటీఆర్ కూడా డ్రగ్స్ వినియోగంపై టెస్టులకు సిద్ధమా? అంటూ తెరాస నాయకులకు సవాల్ విసిరారు.

తెరాస పార్టీ 2017లో ఉన్న డ్రగ్స్ కేసును అడ్డుపెట్టుకుని సినిమా ఇండస్ట్రీపై పట్టు సాధించిందని., ఈ డ్రగ్స్ కేసులను అవకాశంగా మార్చుకొని కేటీఆర్ సినిమా ప్రముఖులకు దగ్గరయ్యారని రేవంత్ ఆరోపించారు. అసలు పబ్లకు అర్ధరాత్రి వరకు పర్మిషన్లు ఇచ్చిందెవరంటూ సూటిగా నిలదీసారు.

“అనుమతులు మీరిస్తే అవమానాలు మేము భరించాలా”? అంటూ మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించారు. ఆ సమయంలో పబ్ లో పట్టుబడిన వారందరికీ రక్త నమూనాలు సేకరిస్తే నిజనిజాలు అప్పుడే ప్రజలకు తెలుస్తాయని., డ్రగ్స్ వినియోగదారులు ఎవరైనా శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని., మీ పార్టీకి ఆ దమ్ముందా? అంటూ రేవంత్ రెచ్చిపోయారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే దానిని “బంగారు తెలంగాణ”గా మార్చి యువతకు అందిస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు “డ్రగ్స్ తెలంగాణ”గా రాష్ట్రాన్ని మార్చారంటూ., యువతకు ఉద్యోగ కల్పన చేయలేని ప్రభుత్వం, “మద్యం – మత్తుపదార్ధాలను” మాత్రం యువతకు అందుబాటులో ఉంచిందంటూ తెరాస ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.