Revanth Reddy Arguement with speaker madhusudhanacharyఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరద్ధరించాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు శాసనసభాపతి మధుసూదనాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ మధుసూదనాచారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయస్థానం తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ రేవంత్‌రెడ్డి నిలదీశారు. ‘

పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్లు’గా మీ వైఖరి ఉందంటూ స్పీకర్‌ను గట్టిగా నిలదీశారు. రేవంత్‌ వ్యాఖ్యలతో చిన్నబుచ్చుకున్న స్పీకర్‌.. మీరు ఇలా మాట్లాడితే వెళ్లిపోతానని అన్నారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్‌రెడ్డిని వారించారు. అయితే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశానని ఇప్పటికే ప్రకటించిన రేవంత్ రెడ్డికి స్పీకర్ కార్యాలయంలో ఏం పని అని తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ ప్రసంగం సందర్బంగా స్పీకరుపైకి మైక్ విసిరారని దీనితో ఆయన గాయపడ్డారని ఆరోపిస్తూ ప్రభుత్వం వారిద్దరిని సస్పెండ్ చేసింది. అయితే వారిద్దరూ కోర్టుకు వెళ్లి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అయితే స్పీకరుకు ఉన్న విశేషాధికారాలతో ఆ తీర్పును అమలు చెయ్యడం లేదు.