Revanth Reddy Joins Congress Partyతెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి పోతుపోతూ ఆ పార్టీకి బానే నష్టం చేసి పోయినట్టు ఉన్నాడు. డిల్లీలో రాహుల్ గాందీ సమక్షంలో కాంగ్రెస్ లో కాసేపటి క్రితం జాయిన్ అయ్యాడు రేవంత్ రెడ్డి. రేవంత్ తో పాటు నలభైఐదు మంది నేతలు వెళ్లడం విశేషం. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి రేవంత్‌ను రాహుల్‌ గాంధీ నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియా తీసుకొచ్చారు. అనంతరం రేవంత్‌ను పార్టీలోకి రాహుల్‌గాంధీ సాదరంగా ఆహ్వానించారు.

మాజీ మంత్రి బోడ జనార్దన్ తో సహా ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇరవై రెండు మంది జిల్లా స్థాయి నేతలు వీరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి కూడా ఈ బృందంలో ఉన్నారు. పాలిట్ బ్యూరో సభ్యురాలు ,మాజీ ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్ర రెడ్డి,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, పలువురు జిల్లా టిడిపి అద్యక్షులు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

వచ్చే 6 నెలల్లో ఎప్పుడైనా కోడంగల్ ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఆ ఉపఎన్నికలో రేవంత్ ని ఓడించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ రేవంత్ గెలుస్తే కాంగ్రెస్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న బాహుబలి దొరికినట్టే! 2019లో ఒకానొక ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతాడని రేవంత్ అనుచరుల అంచనా.

మరోవైపు నవంబర్ 2న చంద్రబాబు సమక్షంలో తెలంగాణా తెదేపా రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి పార్టీ మారడం వల్ల జరిగే నష్టాన్ని ఆ సమావేశంలో రివ్యూ చెయ్యనున్నారు చంద్రబాబు. ఏదో ఒక అద్బుతమ్ జరిగితే తప్ప 2019 నాటికి తెదేపా కోలుకునే పరిస్తితి లేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.