Restrictions on theaters in Telangana once againకోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆంక్షలను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికతో ఆరోగ్య శాఖ నివేదిక ఇప్పటికే సమర్పించగా, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

ఈ సిఫార్సులను ప్రభుత్వం యధాతధంగా అంగీకరిస్తే… బార్‌లు మూసివేయబడతాయి… అలాగే థియేటర్లలో ఆక్యుపెన్సీ 50% కి మాత్రమే పరిమితం చేయబడుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలను మాత్రమే మూసివేసింది. పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకతో సహా దేశంలోని పలు రాష్ట్రాలు థియేటర్లపై ఆంక్షలు విధించాయి.

ఈ నెల చివరి వరకు మహారాష్ట్ర థియేటర్లను పూర్తిగా మూసివేసింది. 50% ఆక్యుపెన్సీతో చిత్ర పరిశ్రమ కొంత మేర అడ్జస్ట్ అవుతుంది గానీ నైట్ కర్ఫ్యూ పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవని భావిస్తుంది. 50% ఆక్యుపెన్సీ ప్రకటించినట్లయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలా జరిగిందో అలానే… పెద్ద చిత్రాలకు బదులుగా చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయి.

ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్ వంటి సినిమాలు వాయిదాను అధికారికంగా ప్రకటించాయి. కొన్నిపెద్ద సినిమాలు ఆ దిశగా అనధికారికంగా సూచనలు పంపాయి. ఈ గ్యాప్ ను ఇష్క్ (జాంబీ రెడ్డి తేజ హీరో) వంటి సినిమాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.