Restore Reservation in job promotionsఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో మాత్రమే ఉన్న రేజర్వేషన్లు ఇప్పటి నుండి ఉద్యోగుల ప్రమోషన్ల లో కూడా ఉండబోతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ల సమయంలో రిజర్వేషన్‌ను కొనసాగించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన బెంచ్ ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చే వరకూ యథాతథంగా ప్రమోషన్లపై రిజర్వేషన్‌ను కొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రం కూడా రిజర్వేషన్‌ను కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. హైకోర్టుల్లో భిన్నమైన తీర్పులు రావడంతో ఇన్నాళ్లూ నిలుపుదల చేసినట్లు కోర్టుకు వివరణ ఇచ్చింది.

దీనితో రేజర్వేషన్ల పై ఆక్రోశం ఉన్న ఉన్నత వర్గాల పేదలకు ఈ తీర్పు మరింత కంటగింపుగా మారింది. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలు కీలకంగా మారిన తరుణంలో ప్రభుత్వాలు కూడా వాటిని ముట్టుకునే సాహసం చెయ్యలేవు అనేది సత్యం. కాకపోతే నియామకాలలో సరే ప్రమోషన్లలో కూడా అంటే ఇబ్బందే.