Reserve Bank of India asks about Andhra Pradesh capitalఆంధ్రప్రదేశ్ రాజధాని పేరేంటి? ఈ ప్రశ్న ఓ పెద్ద మిస్టరీలా మారిపోయిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటన చేయడం, దానిని వెనక్కి తీసుకోవడం… అమరావతిని రాజధానిగా ఒప్పుకోకపోవడం, ఇదంతా రాజధాని పట్ల జగన్ సర్కార్ అనుసరిస్తోన్న విధానం.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే ఏపీ కాపిటల్ అంశం ఫన్నీగా మారిపోయింది. ఇప్పటికే కొన్ని వేల మేమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇవన్నీ పక్కన పెడితే, తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి పంచ్ వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన ఆర్బీఐకు ఓ లేఖ రాసారు.

ఈ లేఖపై ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ ఎంకే సుభాశ్రీ తాజాగా వివరణ ఇచ్చారు. ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయించండి, ఆ తర్వాత ఆర్బీఐ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన రిప్లై ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తోంది.

రాజధాని లేకుండా ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఇలాంటి అవమానపు ప్రకటనలు తప్పవన్న సంగతి జగన్ సర్కార్ కు ఇప్పటికైనా తెలుస్తుందో? లేదో? రెండు రోజుల క్రితం కూడా మంత్రి అవంతి కూడా మూడు రాజధానుల విషయాన్ని మళ్ళీ ప్రస్తావించిన నేపధ్యంలో, ఇప్పట్లో రాజధానిపై జగన్ సర్కార్ దృష్టి కేంద్రీకరించేది లేదని స్పష్టమవుతోంది.